తెలంగాణ బడ్జెట్ 2025 - 26 లైవ్ అప్డేట్స్

తెలంగాణ బడ్జెట్ 2025 - 26 లైవ్ అప్డేట్స్

  • ఔటర్ కు నలువైపులా శాటిలైట్ టౌన్ షిప్ లు ఏర్పాటు: ఆర్థిక మంత్రి భట్టి
  • అసంపూర్తిగా ఉన్న 34,545 ఇళ్లను రూ. 305 కోట్లతో అందుబాటులోకి తెస్తున్నాం
  • 25.35 లక్షల మంది రైతులకు రూ. 20617 కోట్ల రుణమాఫీ 
  • ఆరు గ్యారంటీలు - రూ.56,084 కోట్లు
  • చేయూత పింఛన్లు – రూ.14,861 కోట్లు
  • ఇందిరమ్మ ఇళ్లు - రూ.12,571 కోట్లు
  • మహాలక్ష్మి (ఆర్టీసీ బస్సు) రూ.4,305 కోట్లు
  • గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) రూ.2,080 కోట్లు
  • సన్నాలకు బోనస్ - రూ.1,800 కోట్లు
  • రాజీవ్ ఆరోగ్యశ్రీ - రూ.1,143 కోట్లు
  • గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ - రూ.723 కోట్లు
  • ఇందిరమ్మ ఆత్మీయ భరోసా - రూ.600 కోట్లు
  • విద్యుత్ రాయితీ - రూ.11,500 కోట్లు
  • రాజీవ్ యువ వికాసం రూ.6 వేల కోట్లు
  • రైతు భరోసా - రూ.18 వేల కోట్లు
  • అమ్మకం పన్ను ఆదాయం అంచనా రూ.37,463 కోట్లు
  • వాహనాలపై పన్ను ఆదాయం అంచనా రూ.8,535 కోట్లు
  • స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా రూ.19,087 కోట్లు
  • ఎక్సైజ్ శాఖ ఆదాయం అంచనా రూ.27,623 కోట్లు
  • రాష్ట్ర పన్నుల రాబడి అంచనా రూ.1,45,419 కోట్లు
  • బడ్జెట్‌లో ప్రతిపాదించిన రుణాలు రూ.69,639 కోట్లు
  • కేంద్ర పన్నుల్లో వాటా రూ.29,899 కోట్లు
  • పన్నేతర ఆదాయం అంచనా రూ.31,618 కోట్లు
  • కేంద్రం నుంచి గ్రాంట్ల అంచనా రూ.22,782 కోట్లు
  • ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి అప్పుల అంచనా రూ.5,04,814 కోట్లు
  • జీఎస్డీపీలో అప్పుల శాతం 28.1గా అంచనా
  • రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలకు లబ్ధి
  • సిలిండర్ల రాయితీ కింద రూ.433 కోట్లు చెల్లించాం : భట్టి
  • గృహజ్యోతి పథకం ద్వారా 50 లక్షల కుటుంబాలకు లబ్ధి
  • గృహజ్యోతి పథకం కోసం రూ.1,775 కోట్లు రాయితీ ఇచ్చాం
  • ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు రూ.5,006 కోట్లు ఆదా
  • అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, అదనపు కుటుంబ సభ్యుల పేర్లు నమోదు.. వాళ్లకు సన్న బియ్యం.. పౌరసరఫరాల శాఖకు 5 వేల 730 కోట్ల కేటాయింపు
  • భూమితో ఉన్న అనుబంధం.. తల్లితో ఉన్న అనుబంధం లాంటిది.. ధరణిలో అక్రమాల వల్ల సామాన్యులకు తీవ్ర ఆవేదన కలిగింది. వీటి పరిష్కరించటానికి కలెక్టర్లకు మాత్రమే ఉన్న అధికారాలను మార్పు చేయటం జరిగింది. 
  • భూ భారతి చట్టాన్ని తీసుకురావటం జరిగింది. భూ యజమాన్య హక్కులను పరిరక్షించటానికి ఉపయోగపడుతుంది. భూ భారతి లావాదేవీలను సులభతరం చేసింది.
  • ఆయిల్ ఫాం దిగుమతులపై సుంకం విధించేలా కృషి.. దీని వల్ల ఆయిల్ ఫాం రైతులకు టన్నుకు 2 వేల రూపాయలు ధర పెరిగింది.
  • సన్న ధాన్యం కింటాలుకు 500 రూపాయలు అదనపు బోసన్.. సన్నరకాల వరిసాగు గణనీయంగా పెరిగింది. 
  • గత ఖరీఫ్ తో పోల్చితే.. 40 లక్షల ఎకరాలకు పెరిగింది. గతంలో 25 లక్షల ఎకరాలు మాత్రమే
  • రైతన్నకు ఇచ్చి 2 లక్షలలోపు రుణాలను మాఫీ చేసింది.. 25.3 లక్షల మంది రైతులకు.. 26 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 
  • దీని వల్ల రైతులు మళ్లీ వ్యవసాయ రుణాలు పొందటానికి అవకాశం కల్పించాం... దీని వల్ల రైతులు ఆర్థిక, సామాజిక భద్రతను పెంచేందుకు కృషి చేశాం
  • పెట్టుబడి సాయం 2025 జనవరి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాం.. రైతులకు ఏడాదికి ఎకరానికి 12 వేల రూపాయలు అందుతాయి. 
  • ప్రజాదనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి.. రైతు భరోసా అందిస్తాం.. గ్రామ సభల్లో నిరూపించటం ద్వారా వృధాను అరికట్టాం. 
  • రైతు భరోసాకు 18 వేల కోట్ల రూపాయలు కేటాయింపు 
  • విద్యా రంగం- రూ.23,108 కోట్లు
  •  పౌరసరఫరా-ల శాఖ- రూ.5,734 కోట్లు
  •  పశుసంవర్ధకం- రూ.1,674 కోట్లు
  •  ఎస్టీ సంక్షేమం- రూ.17,169 కోట్లు
  •  ఎస్సీ సంక్షేమం- రూ.40,232 కోట్లు
  •  మహిళా శిశుసంక్షేమ శాఖ- రూ.2,862 కోట్లు
  •  పంచాయతీరాజ్  శాఖ- రూ.31,605 కోట్లు
  •  కార్మిక శాఖ- రూ.900 కోట్లు
  • పురపాలక శాఖ- రూ.17,677 కోట్లు
  •  వైద్య రంగం- రూ.12,393 కోట్లు
  •  విద్యుత్ రంగం- రూ.21,221 కోట్లు
  •  ఐటీ రంగం- రూ.774 కోట్లు
  •  పరిశ్రమలు- రూ.3,527 కోట్లు
  •  మైనార్టీ సంక్షేమ శాఖ- రూ.3,591 కోట్లు
  •  చేనేత రంగం- రూ.371 కోట్లు
  •  బీసీ సంక్షేమం- రూ.11,405 కోట్లు
  •  వ్యవసాయ శాఖకు కేటాయింపులు- రూ.24,439 కోట్లు
  •  మూలధన వ్యయం- రూ.36,504 కోట్లు
  •  రెవెన్యూ వ్యయం- రూ.2,26,982 కోట్లు
  •  2025-26 రాష్ట్ర బడ్జెట్ రూ.3,04,965 కోట్లు
  • రాష్ట్ర తలసరి ఆదాయం 3 లక్షల 79 వేల 751 రూపాయలు, దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే ఒక లక్షా 74 వేల 172 రూపాయలు ఎక్కువ..
  • రాష్ట్ర వృద్ధి రేటు 9.6 శాతం. వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 17.3 శాతం
  • ఉపాధిలో చైనా ప్లస్ 1 పాలసీ అనుసరిస్తున్నాం, పరిశ్రమలతో 22.5 శాతం మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం
  • పదేళ్లలో ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం 
  • తెలంగాణ రైజింగ్ 2050తో పాలసీ 
  • అభివృద్ధి, సంక్షేమాన్ని జోడు గుర్రాలుగా.. తెలంగాణ రైజింగ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది : భట్టి
  • దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలుపుతున్నాం: ఆర్థిక మంత్రి భట్టి  
  • మా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో, సొంత పత్రికలు, ఛానెళ్లలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు : ఆర్థిక మంత్రి భట్టి
  • అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజా పాలన కొనసాగుతుంది.. నిజాలను  ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతున్నాం : భట్టి విక్రమార్క
  • మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క్
  •  రాష్ట్ర బడ్జెట్ ప్రతులను శాసన సభ స్పీకర్, శాసనమండలి చైర్మన్లకు అందించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క్
  • 2025 - 26 బడ్జెట్ కు ఆమోదం తెలిపిన క్యాబినెట్. 
  • సొంత రాబడి, భూముల అమ్మకంతో నాన్​ ట్యాక్స్,​ ట్యాక్స్ ​రెవెన్యూ పెరుగుతుందని అంచనాలు
  • విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రయారిటీ
  • రూ.3.10  లక్షల కోట్ల వరకు 2025–26 పద్దు?
  • అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు
  • ఉదయం 11:09 గంటలకు రాష్ట్ర బడ్జెట్