
రేపు (మార్చి 19న) ఉదయం11.14 గంటలకు అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ లో కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. కాంగ్రెస్ సర్కార్ కు ఇది రెండో బడ్జెట్.
2024–25లో రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్ను పెట్టగా.. ఈసారి రూ.3 లక్షల కోట్ల పైనే అంచనాలు ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు తప్ప వేరే సర్దుబాటు లేదు. కేంద్రం కూడా ఈసారి బడ్జెట్ ను గతం కంటే రూ.2.5 లక్షల కోట్లు మాత్రమే పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుందా అనే ఆసక్తి నెలకొన్నది.
ALSO READ | జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి.. సీఎం రేవంత్ రెడ్డికి టీడబ్ల్యూజేఎఫ్ రిక్వెస్ట్
మరో వైపు ఏ శాఖకు ఎన్ని కోట్లు కేటాయిస్తారు..ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.ఆరు గ్యారంటీల్లో ఏ పథకానికి ఎన్ని కోట్లు కేటాయిస్తారోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.