
తెలంగాణ ప్రభుత్వం 2025 బడ్జెట్ ప్రవేశపెట్టింది. అసెంబ్లీకి సమర్పించిన తన బడ్జెట్ లో రాష్ట్ర ఆదాయా మార్గాల అంచనాను వెల్లడించారు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.
- అమ్మకం పన్ను ద్వారా ఆదాయం 37 వేల 463 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేసింది ప్రభుత్వం.
- ఇక వాహనాలపై పన్ను ఆదాయం అంచనాను 8 వేల 535 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది.
- భూములు, ఇళ్ల అమ్మకం కొనుగోలు ద్వారా ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా 19 వేల 087 కోట్ల రూపాయలుగా స్పష్టం చేసింది ప్రభుత్వం.
- ఎక్సైజ్ శాఖ అంటే మందు.. లిక్కర్ అమ్మకాల ద్వారా ఆదాయం అంచనా 27 వేల 623 కోట్ల రూపాయలుగా టార్గెట్ పెట్టుకున్నది సర్కార్.
- రాష్ట్ర పన్నుల రాబడి అంచనా ఒక లక్షా 45 వేల 419 కోట్లుగా స్పష్టం చేసింది ప్రభుత్వం.
- బడ్జెట్‌లో ప్రతిపాదించిన రుణాలను 69 వేల 639 కోట్లుగా వెల్లడించింది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
- కేంద్ర పన్నుల్లో వాటా 29 వేల 899 కోట్లు, పన్నేతర ఆదాయం అంచనా 31 వేల 618 కోట్లుగా ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.
- కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను 22 వేల 782 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు.
- ఈ ఆర్థిక ఏడాది.. అంటే 2025.. 26 ముగిసే నాటికి అప్పులు 5 లక్షల 04 వేల 814 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. జీఎస్డీపీలో అప్పులు 28.1 శాతంగా అంచనా వేసింది ప్రభుత్వం.
గత ఏడాది బడ్జెట్ లో ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ. 25 వేల 617కోట్లుగా అంచనా వేయగా.. ఈ ఏడాది బడ్జెట్ లో ఎక్సైజ్ శాఖ ఆదాయం 27 వేల 623 కోట్లగా అంచనా వేసింది.