తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది : కేసీఆర్

ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు మాజీ సీఎం కేసీఆర్. రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. తాము ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. మత్స్యకారులకు భరోసా లేదని గొర్రెల పంపిణీ పథకాన్ని పూర్తిగా మూసివేసినట్లు కనిపిస్తోందని అన్నారు. బడ్జెట్ లో దళిత బంధు  ప్రస్తావన లేదని తెలిపారు.

 ఒక్క కొత్త పథకం ప్రవేశపెట్టలేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ, పరిశ్రమల సంగతి ఏంటని ప్రశ్నించారు. రైతులను వృత్తికార్మికులను ప్రభుత్వం వంచించిందని విమర్శించారు మాజీ సీఎం కేసీఆర్.

ఏ వర్గానికి న్యాయం జరగలేదని.. ఏ ఒక్క కొత్త పథకం ప్రకటించలేదన్నారు కేసీఆర్. గొర్రెల పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్లు స్పష్టం అయ్యిందన్నారు.  వ్యవసాయం, పారిశ్రామిక, ఐటీ పాలసీలు ప్రకటించలేదని.. ఆయా రంగాల అభివృద్ధికి ఏం చర్యలు తీసుకుంటున్నారో విధివిధానాలు బడ్జెట్ లో లేదన్నారు. ఉన్న పథకాలను మూసివేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. దళిత బంధు ఊసే ఎత్తలేదన్నారు కేసీఆర్. 

ఓడిన తర్వాత.. ప్రతిపక్ష నేత హోదాలో బడ్జెట్ సమావేశానికి హాజరైన కేసీఆర్.. మీడియా కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడి.. తాను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోయారు.