Telangana Budget 2025: ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా.. ఆరు గ్యారంటీలకు.. ఎంతెంత నిధులు ఇచ్చారంటే..

Telangana Budget 2025: ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా.. ఆరు గ్యారంటీలకు.. ఎంతెంత నిధులు ఇచ్చారంటే..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ముగిసింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం.. శాసన సభ, శాసన మండలి.. ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3 కోట్ల 4వేల 965 కోట్లతో వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.

మూలధన వ్యయం రూ.36 వేల 504 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.2 లక్షల 26 వేల 982 కోట్లుగా భట్టి తెలిపారు. రైజింగ్ తెలంగాణ నినాదంతో ముందుకెళుతున్నామని భట్టి పేర్కొన్నారు. 

బడ్జెట్ లో గ్యారంటీ పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. 6 గ్యారంటీల్లోని 9 స్కీమ్లకు 56 వేల 84 కోట్లను బడ్జెట్లో కేటాయించినట్లు ఆర్థిక మంత్రి భట్టి తెలిపారు. రైతు భరోసాకు తెలంగాణ సర్కార్ 18 వేల కోట్లు కేటాయించింది. చేయూతకు 14 వేల 861 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్ల రూపాయలను కేటాయించడం విశేషం. ఇందిరమ్మ ఇండ్లకు రూ.12 వేల 571 కోట్లు, ఫ్రీ బస్ స్కీంకు రూ.4 వేల 305 కోట్లు, ఫ్రీ కరెంట్ కు రూ.2 వేల 80 కోట్లు, సన్న వడ్ల బోనస్ రూ.18 వందల కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

ALSO READ : 756 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఫ్యూచర్ సిటీ.. బడ్జెట్లో క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

రాజీవ్ ఆరోగ్య శ్రీకి రూ.11 వందల 43 కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రూ.723 కోట్లను కేటాయించి ఆరు గ్యారెంటీల అమలు ఎట్టి పరిస్థితుల్లో ఆగదని తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ గ్యారంటీ ఇచ్చింది.