
గత సర్కార్ హయాంలో వేసిన రోడ్ల నిర్మాణంపై అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ హయాంలో రహాదారులు దారుణంగా ఉన్నాయన్నారు మంత్రి కోమటి రెడ్డి. హరీశ్ రావు మంచి నాయకుడు ఇంతలా అబద్ధాలు ఆడటం బాగలేదన్నారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఓఆర్ఆర్ ను అప్పనంగా అమ్మేసిందని ఆరోపించారు. ఓఆర్ఆర్ విలువ లక్ష కోట్లకు పైనే ఉంటుందన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి కేవలం 7 వేల 300 కోట్లు కట్టబెట్టారని చెప్పారు. కోకాపేటల భూములు మీ బినామీ సంగతి రాష్ట్రమంతా తెలుసన్నారు. హరీశ్ ను ముందు పెట్టి వెనుక ఇద్దరు, ముగ్గురు నడిపిస్తున్నారని తెలిపారు. వెంటనే స్పీకర్ కల్గజేసుకుని మా వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదని అన్నారు.
అంతకుముందు బడ్జెట్ పై చర్చ సందర్బంగా మాట్లాడిన హరీశ్ రావు. వాస్తవికతకు బడ్జెట్ దూరంగా ఉందన్నారు. ఆరు గర్యారంటీలు ఆవిరైపోయాయాని విమర్శించారు. బడ్జెట్ లో 4 వేల రూపాయల పెన్షన్ ఊసే లేదన్నారు. సర్కార్ చెప్పే తెలంగాణ రైజింగ్ ఎక్కడుందని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ఇప్పుడు భూములు లాక్కుంటున్నారు. ఇపుడు భూములు అమ్ముదామంటున్నారు. రైతుభరోసా సాయం సగం మందికి కూడా అందలేదన్నారు. ఆరు గ్యారంటీలకు దిక్కు లేదు కానీ అందాల పోటీలు పెడతారా అని ప్రశ్నించారు హరీశ్ రావు.
ALSO READ | తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఒకట్రెండు బైకులు.. ఐదు కుటుంబాలకు ఓ కారు
ప్రతిపక్షాలు అబద్దాలు చెబితే వినే వాళ్లు ఎవరు లేరన్నారు. సీఎం వ్యాఖ్యలను హరీశ్ పక్కదారిపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సూచనల పేరుతో ప్రభుత్వంపై హరీశ్ విమర్శలు చేస్తున్నారని చెప్పారు. 2గంటల స్పీచ్ లో ప్రభుత్వంపై విమర్శలే ఎక్కువ చేశారన్నారు. గతంలో తమకు మాట్లాడాటానికి బీఆర్ఎస్ 10 నిమిషాల టైం కూడా ఇవ్వలేదన్నారు శ్రీధర్ బాబు.