
అసెంబ్లీలో నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్ ని ప్రవేశపెట్టారు సీఎం కేసీఆర్. నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఇవాళ్టి తాత్కాలిక బడ్జెట్ లో రూ.1810 కోట్లు కేటాయించినట్లు తెలిపారు కేసీఆర్. నిరుద్యోగ భృతికి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.