అర్థరాత్రి ఏటీఏం చోరీకి యత్నించి విఫలమైన దొంగలు

నిజామాబాద్లో  ఏటీఎం దొంగలు రెచ్చిపోతున్నారు. జిల్లాల్లో.. హైవేలపై ఉన్న ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని చోరీ చేస్తున్నారు.  నిజామాబాద్ జిల్లా వేల్పూరులో   అక్టోబర్ 9  వ తేది రాత్రి   ఏటీఎం మిషన్‌ను  ఎత్తుకెళ్లేందుకు యత్నించారు దొంగలు.

 వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎం దగ్గర ఏటీఎంను  పగులగొట్టి నగదు తీయడానికి ప్రయత్నించారు. ఏటీఎం చోరీకి దొంగలు యత్నిస్తుండగా స్థానికులు చూసి కేకలు వేశారు. దీంతో దుండగులు ఏటీఎంను అక్కడే వదిలి పారిపోయారు.

Also Read :- టాయ్ లెట్ ను బెడ్రూం చేశారు.. దానికి 12 వేల అద్దె

గత కొన్ని రోజులుగా  జిల్లాలో వరుసగా  ఏటీఎం చోరీలు జరుగుతున్నాయి.  పోచంపాడ్‌లోని ఏటీఎంలో 15 రోజుల క్రితం దొంగలు చోరీకి ప్రయత్నించారు. భీమ్‌గల్ మండలంలో ఆదివారం కూడా అలాంటి ప్రయత్నమే జరిగింది.