ఇకనుంచి TS కాదు..TGగా మార్పు .. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు

ఇకనుంచి TS కాదు..TGగా మార్పు .. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తెలంగాణ కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. ఆదివారం (ఫిబ్రవరి 4) సుమారు నాలుగు గంటలపాటు జరిగిన భేటీ.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం వాహనాల నంబర్‌ ప్లేట్లపై TS ఉండగా, ఇక నుంచి TGగా మారుస్తూ కేబినెట్‌ నిర్ణయించింది.

కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు 

  • 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకానికి కేబినెట్ ఆమోదం 
  • 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి ఆమోదం
  • ప్రస్తుతం వాహనాల నంబర్‌ ప్లేట్లపై TS ఉండగా, ఇక నుంచి TGగా మారుస్తూ కేబినెట్‌ నిర్ణయం 
  • ఫిబ్రవరి 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం 
  • తెలంగాణ  తల్లి విగ్రహ రూపంలో మార్పులు
  • రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చాలని కేబినెట్ నిర్ణయం  
  • రాష్ట్ర గేయంగా జయజయహే తెలంగాణ కు కేబినెట్ ఆమోదం
  • గ్రూప్ 1 లో 160 పోస్టులు కలిపి రీ నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్
  • కులగణనకు తెలంగాణ కేబినెట్ ఆమోదం 
  • అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం 
  • కాంగ్రె స్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మరో రెండు గ్యారంటీల అమలుపై అసెంబ్లీలో ప్రకటన చేయనున్న  ప్రభుత్వం