ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ.. వాటిపైనే చర్చ..!

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 2024, అక్టోబర్ 23వ తేదీన రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి భేటీ కానుంది. 23వ తేదీ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా చట్టబద్ధంగా మారడం.. హైడ్రా ఏర్పాటును హైకోర్టు సమర్థించడం వంటి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. దీంతో పాటు మూసీ ప్రక్షాళన, రైతు భరోసా విధివిధానాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి టాపిక్స్‎పై కేబినెట్ డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

ALSO READ | కొత్త అప్పులు 49 వేల కోట్లు.. పాత అప్పులు, వడ్డీల కింద కట్టింది 56 వేల కోట్లు

కాగా, తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరుతో రైతన్నలకు పట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఒక ఎకరాకు రూ.15 వేలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రైతు భరోసా గైడ్ లైన్స్ రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. వివిధ వర్గాలతో చర్చలు  జరిపిన కేబినెట్ సబ్ కమిటీ.. రైతు భరోసా గైడ్ లైన్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపైనే కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. త్వరలోనే రైతు భరోసా స్కీమ్ ఇంప్లీమెంట్ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే.