డిసెంబర్ 30న తెలంగాణ కేబినెట్ భేటీ

డిసెంబర్ 30న తెలంగాణ కేబినెట్ భేటీ

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 30న రాష్ట్ర కేబినెట్ స‌‌‌‌మావేశం కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆరో ఫ్లోర్‎లో ఈ మీటింగ్​ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో రైతుభరోసా విధి విధానాలు, కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, భూమిలేని నిరు పేద కూలీలకు రెండు విడతల్లో రూ.6 వేల చొప్పున నగదు బదిలీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు అంశాలు కూడా చర్చకు వచ్చే చాన్స్ ఉంది.

ఒక్క ఎకరా కూడా వ్యవసాయ భూమిలేని, కూలి పనులు చేసుకుని జీవిస్తున్న నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకం గురించి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. వచ్చే నెల సంక్రాంతి తరువాత రైతుభరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. దీనిపై కూడా చర్చించే అవకాశం ఉంది.