డిసెంబర్ 30న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, భూమిలేని నిరుపేదలకు నగదు బదిలీ, యాదగిరి గుట్ట బోర్డు ఏర్పాటుపై చర్చ జరిగే అవకాశం ఉంది.
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రేషన్ కార్డు అర్హతలు, విధివిధానాలు, వార్షిక ఆదాయ పరిమితిపై మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే చర్చించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు రేషన్‌కార్డుతో ముడిపడి ఉన్నవే. తెల్ల రేషన్‌కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హులు అవుతారు. దీంతో చాలా మంది రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు.
ALSO READ | భౌతిక దాడులు సహించం.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది: మంత్రి కోమటిరెడ్డి ట్వీట్
మరో వైపు రైతుభరోసాపై రైతులు ఎదురుచూస్తున్నారు.సంక్రాంతి తర్వాత రైతుభరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తారనే విధివిధానాలపై చర్చించనున్నారు.