జూన్ 21న కేబినెట్​ భేటీ! .. రుణమాఫీ మార్గదర్శకాలకు ఆమోదం!

జూన్ 21న కేబినెట్​ భేటీ! ..  రుణమాఫీ మార్గదర్శకాలకు ఆమోదం!

హైదరాబాద్, వెలుగు : ఈ నెల 21న రాష్ట్ర కేబినెట్  సమావేశం కానున్నట్లు తెలిసింది. తొందరలోనే రైతులు గుడ్ న్యూస్ వింటారని కాంగ్రెస్  నేతలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేబినెట్​ భేటీలో రైతు రుణమాఫీ అమలుకు సంబంధించిన విధి విధానాలను ఖరారుచేసే అవకాశాలు ఉన్నాయి. రాబోయే ఐదేళ్లకు సంబంధించి సంక్షేమ, అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటుపైనా చర్చించే అవకాశం ఉంది.