రుణమాఫీనే ప్రధాన ఎజెండా!.. నేడు కేబినెట్ మీటింగ్

రుణమాఫీనే ప్రధాన ఎజెండా!.. నేడు కేబినెట్ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియెట్​లో కేబినేట్ మీటింగ్ జరగనుంది. ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో రుణమాఫీ ప్రధాన ఎజెండాగా కేబినెట్​ మీటింగ్ జరగనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ రెడీ చేశాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, రూ.10 వేలకు మించి పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ చెల్లించేవారు, డాక్టర్లు, ఇంజినీర్లు, సీఏ, ఆర్కిటెక్ట్ లాంటి ప్రొఫెషనల్స్​ను రుణమాఫీ నుంచి మినహాయించనున్నట్లు తెలిసింది. రుణమాఫీ నిబంధనలతో పాటు కటాఫ్ తేదీని కేబినేట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 

ముఖ్యంగా నిధుల కోసం ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టడమా? లేదంటే కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేయడమా? అనేది ఉత్కంఠ రేపుతోంది. గతంలో హైకోర్టు ఉత్తర్వులతో వెనక్కి వచ్చిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియమాకంపైనా కేబినేట్​లో చర్చించే అవకాశం ఉంది. మళ్లీ ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉర్దూ దినపత్రిక అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎడిటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆమేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీలుగా కేబినెట్ ఆమోదం తెలియజేసే చాన్స్​ఉంది. వీటితో పాటు వ్యవసాయ కమిషన్, విద్యా కమిషన్​ల ఏర్పాటు, పూర్తిస్థాయి బడ్జెట్, అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుపైనా కేబినేట్​లో చర్చ జరిపి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.