తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..ధరణి ఔట్.. కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..ధరణి ఔట్.. కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ మంత్రి వర్గ సమవేశం గురువారం ఆగస్టు 1, 2024న సచివాలయంలో జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. అసెంబ్లీలో సమావేశాలు మరో రెండు రోజులు ఉన్న క్రమంలో కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలకనిర్ణయాలు తీసుకున్నారు. 

కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ లో నిర్ణయించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ధరణి పోర్టల్ ను భూమాతకు మార్చాలని నిర్ణయించారు. వయనాడ్ బాధితులకు సంతాపం తెలిపారు. వయనాడ్ బాధితులకు సాయం చేయాలని నిర్ణయించారు. 

గౌరెల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పూర్తియితే 2లక్షల ఎకరాలుసాగులోకి వస్తాయి. అదేవిధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ కు మంత్రి వర్గం నిర్ణయించింది. మూసీ ప్రక్షాళన చేయాలని ఇందుకోసం నిధులు కేటాయించింది.

 హైదరాబాద్ నగరానికి మల్లన్న సాగర్ నీటిని తరిలించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. హుస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు తరలించేందుకు కేబినెట నిర్ణయించింది.15 టీఎంసీల నీటిలో 5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీరు, 10 టీఎంసీలు, మూసీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు నింపేందుకు నిర్ణయించారు. 

క్రీడాకారులు బాక్సర్ నిఖత్ జరీన్ , సిరాజ్ కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించారు. ఈషాసింగ్, నిఖత్ జరీన్, సిరాజ్ లకు హైదరాబాద్ ల 600 గజాల ఇంటిస్థలాన్ని కేటాయించింది.