ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్ చేస్తూ క్యాబినెట్ తీర్మానం

ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్ చేస్తూ క్యాబినెట్ తీర్మానం

ములుగు: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. క్యాబినెట్ సమావేశంలో ఈ తీర్మానాన్ని మంత్రిమండలి ఆమోదించింది. ఈ నిర్ణయంతో బాణ సంచాలు కాల్చుతూ స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, ఏటూరు నాగారం ప్రజలు సంబరాలు చేసుకున్నారు.

ఏటూరునాగారం అంటేనే దట్టమైన చెట్లతో ఉన్న అడవి గుర్తుకొస్తుంది. రకరకాల అడవి జంతువులు తిరిగే ఈ  ప్రాంతాన్ని 1953లో శాంక్చురీగా మార్చారు. మన రాష్ట్రంలోని మొట్ట మొదటి వైల్డ్​లైఫ్​ శాంక్చురీ ఇదే.

Also Read :- ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్

మూడు రాష్ట్రాల సరిహద్దులో (తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్) ఉంది. కొండలు, లోయలతో చూడ ముచ్చటగా కనిపించే ఈ శాంక్చురీ దాదాపు 806 చదరపు కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. ఇక్కడ ఉండే  ‘దెయ్యంవాగు’ రెండు పాయలుగా ప్రవహిస్తుంది. ఈ వాగు శాంక్చురీని రెండు భాగాలుగా చేస్తుంది. 

దెయ్యం వాగు ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ఏడాదంతా నీళ్లు ఉంటాయి. వరంగల్ నుంచి 109 కిలోమీటర్ల దూరంలో ఉంది ఏటూరునాగారం శాంక్చురీ. హైదరాబాద్ నుంచి 250 కిలో మీటర్ల దూరంలో ఉంది.