రేపటి (ఫిబ్రవరి 8) నుంచి తెలంగాణ చెస్ టోర్నీ

రేపటి (ఫిబ్రవరి 8) నుంచి తెలంగాణ చెస్ టోర్నీ

హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌ చర్లపల్లిలో శని, ఆదివారాల్లో జరుగుతుందని స్టేట్ చెస్ అసోసియేషన్ (టీఎస్‌టీఏ) తెలిపింది.  బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నమెంట్‌లో స్విస్ ఫార్మాట్ ( ఫిడే టైమ్ కంట్రోల్ 25+10 సెకండ్స్‌) ఏడు రౌండ్ల పోటీలు ఉంటాయి.

 అండర్‌‌7,9,11, 13,15 ఏజ్ గ్రూప్‌ ప్లేయర్లు టోర్నీలో పాల్గొనవచ్చవని టీఎస్‌టీఏ ప్రెసిడెంట్‌ కేఎస్ ప్రసాద్ తెలిపారు.  ప్లేయర్లు శుక్రవారంలోపు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు  73375 78899 నంబర్‌‌ను సంప్రదించాలని సూచించారు.