తెలంగాణలో ఎన్నికలకు మరో రెండు మూడు నెలలే ఉందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దమవుతున్నామన్నారు. బీఆర్ కే భవన్ లో మీడియా సెంటర్ ని ప్రారంభించిన ఆయన.. మరో వారం రోజుల్లో స్పెషల్ సమ్మరి రివిజన్ ముగుస్తుందన్నారు. తుది ఓటర్ల జాబితా తర్వాత జిల్లాలో అధికారులకు ఈవీఎంలపై అవగాహన చేపిస్తున్నామని చెప్పారు. కొత్తగా 15 లక్షల ఓటర్లు చేరారని. ఓటర్ల సవరణ కొనసాగుతోందన్నారు.మహిళా ఓట్ల సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఎన్నికల నిర్వహణ చాలా పారదర్శకంగా జరుగుతుందన్నారు.
Also Read :- TSPSC గ్రూప్ 1 పరీక్ష.. మళ్లీ రద్దుకు కారణాలేంటి?
అక్టోబర్ 3,4,5 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటిస్తుందని వికాస్ రాజ్ వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర పరిధిలో 20 ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు పనిచేయబోతున్నాయని తెలిపారు. చాలా సమస్యలపై చాలా ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో అడ్రస్ మార్పులపై ఫిర్యాదులు వచ్చాయని .. వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.