ఓటర్లకు యాదాద్రి దర్శనం..టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు

హైదరాబాద్: మునుగోడు మాజీ రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జగన్నాథరావుపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. లేని అధికారంతో గుర్తు మార్పు చేసినందుకు జగన్నాథరావు పై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

మరోవైపు మునుగోడుకు చెందిన 300 మంది ఓటర్లను యాదాద్రికి  తీసుకెళ్లి ప్రమాణం చేయించిన ఘటనపై ఈసీ స్పందించింది.  ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. యాదాద్రి ఖర్చును మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థి ఖాతాలో వేయాలని ఆదేశించింది. 

ఇక బ్యాలెట్ పేపర్ లో షిప్ కు బదులుగా ‘బోట్ విత్ మ్యాన్ అండ్ సెయిల్’ గుర్తును ముద్రించిన విషయంలో ఈసీ సీరియస్ అయ్యింది. ఇందుకు బాధ్యుడైన చౌటుప్పల్ ఎమ్ఆర్వోను సీఈవో  సస్పెండ్ చేశారు. అలాగే బ్యాలెట్ ముద్రణలో పాల్గొన్న ఇతర అధికారుల నుంచి వివరణ కోరారు.  ఆ వ్యక్తికి షిప్ గుర్తును కేటాయిస్తూ సీఈవో నిర్ణయం తీసుకున్నారు.