
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సీతారామ ప్రాజెక్ట్ రెండవ పంప్ హౌస్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ములకలపల్లి మండలం పూసుగూడెం సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ - 2ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.