
గద్దర్ పేరు మీద తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక జ్యురీ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అందులో భాగంగా 2014 జూన్ నుంచి 2023 వరకు రిలీజ్ అయిన బెస్ట్ సినిమాలకు అవార్డ్ ఇస్తామని తెలిపింది.
అలాగే, 2014 నుంచి fdcకి సింహా అవార్డ్స్ కోసం కొందరు చెల్లించిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతిఒక్కరూ సపోర్టు చేయాలని కోరింది. ఈ సందర్భంగా నేడు (మార్చి 12న) తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Also Read:-నటుడు సాయికుమార్కు కొమరం భీం జాతీయ పురస్కారం..
మంగళవారం (మార్చి 11న) గద్దర్ పురస్కారాలకు సంబంధించి విధి విధానాలతో కూడిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం జీవో నంబరు 25ని విడుదల చేస్తూ సినీ వర్గాల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించింది.
గద్దర్ పురస్కారాల ప్రత్యేకత:
తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలు అందించిన పైడి జయరాజ్, కాంతా రావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ నటుడు ఎం.ప్ర భాకర్ రెడ్డి పేరుపై ఉన్న ప్రజాదరణ పొందిన చలన చిత్రానికి అవార్డును కొనసాగించాలని సర్కార్ డిసైడ్ అయింది.
2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. సినీ అవార్డులు అందజేయలేదు. ఈ మేరకు 2014 నుంచి ఏడాదికో ఉత్తమ సినిమాకు అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2014 జూన్ నుంచి 2023 వరకు రిలీజ్ అయిన బెస్ట్ సినిమాలకు అవార్డ్ ఇస్తామని తెలిపింది.
అందుకు గురువారం (మార్చి 13) నుంచి హైదరాబాద్ ఏసీగార్డ్స్‌లోని తెలంగాణ చలన చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇందులో ఫీచర్ ఫిల్మ్స్, జాతీయ సమైక్యతపై సినిమా, బాలల సినిమా, పర్యావరణం/హెరిటేజ్/చరిత్రలపై సినిమా, డెబిట్ ఫీచర్ ఫిల్మ్స్, యానిమేషన్ ఫిలిం కేటగిరీల్లో అవార్డులు అందజేయనున్నారు.
అదేవిధంగా, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్, తెలుగు సినిమాలపై బుక్స్ /విశ్లేష ణాత్మకవ్యాసాలు, ఆర్టిస్టులు/టెక్నీషియన్లకు వ్యక్తిగత అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఉర్దూ సినిమా లను ప్రోత్సహించాలని ఉద్దేశ్యంతో ఓ అవార్డు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఇక వచ్చే నెల (ఏప్రిల్) చివర్లో ఈ పురస్కారాలు అందించేందుకు ప్రభుత్వం భావిస్తోంది.