జపాన్​లో సీఎం టీమ్​ .. స్వాగతం పలికిన భారత రాయబారి శిబు జార్జ్​

జపాన్​లో సీఎం టీమ్​ .. స్వాగతం పలికిన భారత రాయబారి శిబు జార్జ్​
  • నేడు వివిధ సంస్థలతో సీఎం రేవంత్​ చర్చలు 

హైదరాబాద్​, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం జపాన్ పర్యటనలో భాగంగా టోక్యోకు చేరుకుంది. ఈ టీమ్​కు భారత రాయబారి శిబు జార్జ్ స్వాగతం పలికారు. 100 ఏండ్ల చరిత్ర కలిగిన ‘ఇండియా హౌస్‌‌’లో బుధవారం రాత్రి డిన్నర్​ ఇచ్చారు. డీఎంకే ఎంపీ కనిమొళి, కాంగ్రెస్ ఎంపీ కె. రఘువీర్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్, అధికారులతో కలిసి సీఎం రేవంత్​రెడ్డి డిన్నర్​లో పాల్గొన్నారు. 

గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సోనీ గ్రూప్,  జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్‌‌, వివిధ  సంస్థలతో సీఎం సమావేశం కానున్నారు. తోషిబా ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. ఈ టూర్​లో భాగంగా ఒసాకా వరల్డ్ ఎక్స్‌‌పోలో తెలంగాణ పెవిలియన్‌‌ను సీఎం ప్రారంభించనున్నారు.