
హైదరాబాద్ : మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం వైస్ చైర్ పర్సన్ గా సీఎస్ శాంతి కుమారి నియమతులయ్యారు. ఈ నెల 30 వ తేదీ వరకు ఆమె ఎంసీహెచ్ఐర్డీ అదనపు బాధ్యతల్లో ఉంటారు. తర్వాత పూర్తి స్థాయి బా ధ్యతలు స్వీకరిస్తారని ప్రభుత్వ కార్యదర్శి రఘు నందన్ రావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఏప్రిల్ 30వ తేదీన శాంతి కుమారి రిటైర్ అవుతున్న విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావును నియమిస్తూ నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.