ఇంటర్ పరీక్షలపై సీఎస్ కీలక సూచన.. జిరాక్స్ సెంటర్లు మూసేయాలని ఆదేశాలు..

ఇంటర్ పరీక్షలపై సీఎస్ కీలక సూచన.. జిరాక్స్ సెంటర్లు మూసేయాలని ఆదేశాలు..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే సమయంలో.. అంటే మార్చి 5 నుంచి మార్చి 25 వరకూ జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చూడాలని పోలీసులను తెలంగాణ ప్రభుత్వ సీఎస్ సూచించారు.

ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతకుమారి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలు సజావుగా జరగడానికి చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్లకు సలహాలు, సూచనలిచ్చారు. కాపీయింగ్కు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదని సీఎస్ స్పష్టం చేశారు. తెలంగాణ ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు 2025 మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయని ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్లకు మార్చి 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు, సెకండియర్ స్టూడెంట్లకు మార్చి 6వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఎగ్జామ్స్‌‌‌‌ ఉంటాయని బోర్డు అధికారులు వెల్లడించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బ్యాక్ లాగ్ స్టూడెంట్లకు జనవరి 29న ఇంటర్‌‌‌‌ ఎథిక్స్‌‌‌‌ అండ్‌‌‌‌ హ్యూమన్‌‌‌‌ వాల్యూస్‌‌‌‌ పరీక్ష ఉంటుందన్నారు. 30న ఎన్విరాన్‌‌‌‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ జరగనుందని చెప్పారు. ఈ పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫస్టియర్‌‌‌‌ విద్యార్థులకు ఇంగ్లీష్‌‌‌‌ ప్రాక్టికల్స్‌‌‌‌ జనవరి 31న, సెకండియర్ విద్యార్థులకు ఫిబ్రవరి1న పెట్టనున్నట్టు పేర్కొన్నారు.

Also Read:- స్కైప్కు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయిన మైక్రోసాఫ్ట్ !

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహిస్తామని ఇంటర్‌‌‌‌‌‌‌‌ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ప్రాక్టికల్స్ రెండో శనివారం, ఆదివారం కూడా ఉండనున్నాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.