- ఇద్దరిని అరెస్ట్ చేసి, జైలుకు పంపిన తెలంగాణ సీఐడీ పోలీసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జాబ్ వీసా ఇప్పిస్తామంటూ పలు రాష్ట్రాల్లోని సుమారు 100 మందిని మోసం చేసిన ఓ ముఠాలోని ఇద్దరు మోసగాళ్లను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల్లో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఘంటా అనిల్ కుమార్, ఘంటా సునీల్ కుమార్, కొట్టు సాయి రవితేజ, కొట్టు సాయి మనోజ్, శుభం, వంశీ ..హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో అబ్రాడ్ స్టడీ ప్లాన్ కన్సల్టెన్సీ పేరుతో ఆఫీసులను నడిపిస్తున్నారు. ఇక్కడే కాకుండా విజయవాడ, ఢిల్లీలో కూడా దందా చేస్తున్నారు.
వీరు మాల్టా, లాట్వియాతోపాటు ఇతర దేశాల్లో జాబ్స్ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మబలికేవారు. తర్వాత జాబ్వచ్చిందంటూ ఫేక్డాక్యుమెంట్స్చూపించేవారు. ఇలా 100 మందిని మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర రూ. 5 లక్షల చొప్పున వసూలు చేసేవారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని దిలావర్పూర్కు చెందిన గోనే శ్రీనివాస్ ఇలాగే మోసపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోసగాళ్ల లింకులు రాష్ట్రాలు దాటడంతో కేసును సీఐడీకి బదిలీ చేశారు. రంగంలోకి దిగిన సీఐడీ వేట కొనసాగించి.. ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన రవితేజ, మనోజ్‌ను కొయ్యగూడెంలో అరెస్ట్ చేసింది.