- రాష్ట్ర మంత్రులతో కలిసి ప్రారంభించిన సీఎం రేవంత్
- సేవాదృక్పథంతో పనిచేయాలని యాజమాన్యానికి సూచన
హనుమకొండ, వెలుగు: వరంగల్ హంటర్ రోడ్డులోని మెడికవర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. ఈ 300 పడకల హాస్పిటల్‌ను శనివారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. డబ్బు కోణంలో కాకుండా సేవ చేయాలనే దృక్పథంతో మెడికవర్ హాస్పిటల్ పని చేస్తుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ రెడీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లేందుకు మెడికవర్ సాంకేతిక సహకారం అందించాలని కోరారు. అనారోగ్య సమస్యలతో హాస్పిటల్‌కు వచ్చిన వాళ్లంతా నవ్వుతూ ఇంటికి వెళ్లేలా మెడికవర్ కృషి చేయాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో సేవలు: చైర్మన్, ఎండీ డాక్టర్ అనిల్
యూరప్‌లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూపులలో ఒకటిగా.. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో సేవలందిస్తూ మెడికవర్హెల్త్ కేర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిందని ఆ హాస్పిటల్స్ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.అనిల్ కృష్ణ తెలిపారు. భారత దేశంలో అగ్రగామి మల్టీ నేషనల్ హాస్పిటల్ చైన్ గా ప్రస్తుతం 24 హాస్పిటల్స్ ను నిర్వహిస్తున్నామని, ఏటా లక్షలాది మందికి నాణ్యమైన వైద్య సేవలందిస్తున్నామని చెప్పారు.
అత్యంత నిష్ణాతులైన 40 మందికి పైగా డాక్టర్ల తోపాటు ప్రపంచస్థాయి క్యాత్ ల్యాబ్ ఇక్కడ అందుబాటులో ఉంటుందని, స్పెషాలిటీ సేవల కోసం హైదరాబాద్ వెళ్లే ప్రజలకు ఆ ఇబ్బందులు దూరం చేస్తుందని తెలిపారు. వరంగల్ లో 300 పడకలతో ఏర్పాటు చేసిన ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో 7 ఆపరేషన్ థియేటర్స్, పెద్ద సంఖ్యలో ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ ఏ శరత్ రెడ్డి , పీ హరికృష్ణ పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సదుపాయాలు కలిగిన ఈ హాస్పిటల్ లో 20 కి పైగా సూపర్ స్పెషాలిటీ సేవలతో అత్యున్నత వైద్యం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.
ఏపీ, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక లో కూడా మెడికవర్ కార్యకలాపాలు నిర్వహిస్తుందని, త్వరలోనే మరిన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు రామచంద్రు నాయక్, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, యశస్విని, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.