
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు వారు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లారు. వారికి ఎయిర్ పోర్టులో టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం శ్రీవారి తోమాల, సుప్రభాత సేవలో పాల్గొంటారు.