కొండగట్టుకు చేరుకున్న సీఎం కేసీఆర్ 

సీఎం కేసీఆర్ కొండగట్టుకు చేరుకున్నారు. హెలికాప్టర్ ద్వారా కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం సమీక్షించనున్నారు. సీఎం కొండగట్టు టూర్ సందర్భంగా పోలీసులు అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో రాత్రి నుంచే భక్తులకు దర్శనాలను బంద్ చేశారు. కొండ కింద షాపులను పోలీసులు మూసి వేయించారు. ఇటీవల కొండగట్టు ఆలయ అభివృద్ధి సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.