నవంబర్​ 3 న ఆలూర్ బైపాస్ రోడ్​లో సీఎం కేసీఆర్​ సభ

ఆర్మూర్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 3 న ఆర్మూర్ టౌన్ శివారులోని ఆలూర్ బైపాస్ రోడ్​లో జరిగే ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సభ కు సీఎం కేసీఆర్ హాజరవుతారని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్న గారి జీవన్ రెడ్డి తెలిపారు. బుధవారం సీఎం సభాస్థలం కొనసాగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సీఎం సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నట్లు జీవన్​రెడ్డి చెప్పారు.