కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ వార్నింగ్

కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.  నామినేషన్ వేసేందుకు అక్కడికి చేరుకున్న సీఎం..  నేరుగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఇంటికి వెళ్లారు. అక్కడ జిల్లా పార్టీ నేతలతో సీఎం సమావేశమయ్యారు.  ఈ క్రమంలో పార్టీ నేతలకు సీఎం దిశానిర్ధేశం చేశారు.  ఇటీవల కామారెడ్డిలో చోటు చేసుకున్న వివాదాలపై ఆరా తీసిన సీఎం..  గ్రూప్‌ తగాదాలు వీడాలని, కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.  

పార్టీ గీత దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం కేసీఆర్ .  ఎన్నికల్లో పార్టీ నుంచి తప్పుడు సంకేతాలు వెళ్లొద్దని నేతలకు సూచించారు. మరికాసేపట్లో సీఎం కామారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.  అనంతరం అక్కడ జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.  అంతకుముందు సీఎం కేసీఆర్ గజ్వేల్ లో నామినేషన్ వేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌజ్ నుంచి గజ్వేల్ కు  వెళ్లిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా  నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.  

Aslo Read :-చెన్నూరులో నామినేషన్ వేసిన వివేక్ వెంకటస్వామి