హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసే పనుల గురించి తుక్కుగూడ విజయభేరి సభలో ప్రజలకు వెల్లడిస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. శనివారం తాజ్ కృష్ణ హోటల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ హైదరాబాద్‌కు వచ్చారు. ఆమెకు ఘన స్వాగతం పలికాం. తెలంగాణ ప్రజలందరూ ఆదివారం జరిగే విజయభేరి సభకు తరలి రావాలి. రాష్ట్రంలో బీజేపీ లేదు. కేసీఆర్ పతనం మొదలైంది’ అని కోమటిరెడ్డి అన్నారు.
ALSO READ: కరీంనగర్ లో జోడు పదవుల నేత జోరు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆయన మంత్రివర్గంలో తెలంగాణ ద్రోహులే ఉన్నారని, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులను కూడా కేసీఆర్ ఆదుకోలేదని కోమటిరెడ్డి విమర్శించారు.