
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి గురువారం నాంపల్లి కోర్టుకు వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు. నల్గొండ టూ టౌన్ పీఎస్, బేగంబజార్ పీఎస్, మెదక్ జిల్లా కౌడిపల్లి పీఎస్ పరిధిలో నమోదైన మూడు కేసుల్లో వ్యక్తిగతంగా జడ్జి ముందు హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి తరఫున టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ కోర్టులో వకాలత్ దాఖలు చేశారు. ఈ కేసుల విచారణను కోర్టు మార్చి 23కు వాయిదా వేసింది. సీఎం కోర్టుకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు హాల్ వద్దకు ఇతరులను అనుమతించలేదు.