స్వాతంత్య్రం తర్వాత ఇదే మొదటి సారి: విద్యార్థుల మెస్, కాస్మొటిక్ ఛార్జీలపై సీఎం రేవంత్

స్వాతంత్య్రం తర్వాత ఇదే మొదటి సారి: విద్యార్థుల మెస్, కాస్మొటిక్ ఛార్జీలపై సీఎం రేవంత్

గురుకులాల్లో గత 16 ఏళ్లుగా కాస్మొటిక్ ఛార్జీలు పెంచలేదని, తమ ప్రభుత్వం 200 శాతం పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. స్వాతంత్య్రం తర్వాత ఇంతలా పెంచడం ఇదే మొదటి సారి అని అన్నారు. 

అదే విధంగా 2008 లో నిర్ణయించిన మెస్ ఛార్జీలనే ఇప్పటి వరకు అమలు చేశారని, కానీ తమ ప్రభుత్వం మెస్ ఛార్జీలను ఒకేసారి 40 శాతం పెంచినట్లు తెలిపారు.  గురుకులాల్లో నిధుల కొరత అనే ప్రశ్న రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బిల్లులు రాకపోవడం వలన కిరాణం లో అప్పు తెచ్చి నడిపించే పరిస్థితి ఉందని సిబ్బంది చెప్పారని.. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదని అన్నారు సీఎం.

 ప్రతినెల 10వ తేదీ లోపల గ్రీన్ చానల్ ద్వారా నిధులు అందేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్కూల్ డ్రెస్ లు ప్రైవేటు కంపెనీలకు ఇవ్వకుండా.. మహిళ సంఘాలకు బాధ్యతలు ఇచ్చినట్లు తెలిపారు.