Rythu Runa Mafi : రైతు రుణమాఫీ గురించి 20 సంవత్సరాలు చెప్పుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు కీలక సూచన చేశారు. గతంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఉచిత కరెంటు, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉన్నామని గుర్తుచేశారు. రేపు రైతు రుణమాఫీ గురించి 20 సంవత్సరాలు చెప్పుకోవాలని ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేపు సాయంత్రం 4  గంటలకు తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు వేదికలకు కనెక్ట్ అవుతానని చెప్పారు. రైతు వేదికలో రైతులంతా సమావేశం కావాలని, ఇది రాహుల్ గాందీ చెప్పారని చెప్పండని కాంగ్రెస్ కేడర్కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Also Read :- 6 లక్షల మంది కుటుంబాలకు రూ.2 లక్షల రుణమాఫీ