సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ .. చర్చల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులు వీరే

సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ ..  చర్చల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులు వీరే

హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.  ఏపీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు, మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ, మరో ఇద్దరు అధికారులు హాజరయ్యారు.  తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ, మరో ఇద్దరు అధికారులు హాజరయ్యారు. 

ఏపీ నుంచి

1.   సీఎం చంద్రబాబు నాయుడు    
2. కందుల దుర్గేశ్        
3. అనగాని సత్యప్రసాద్        
4. సీఎస్ నీరబ్ కుమార్
5. ఏఐఎస్ ఎం.జానకి, కార్తికేయ మిశ్రా 

తెలంగాణ

1. సీఎం  రేవంత్ రెడ్డి        
2డిప్యూటీ సీఎం. భట్టి విక్రమార్క        
3.మంత్రి  శ్రీధర్ బాబు        
4. మంత్రి   పొన్నం ప్రభాకర్        
5.సీఎస్ శాంతి కుమారి
6. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి
7. ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్
8. ఐఏఎస్ లు రామకృష్ణ, వి.శేషాద్రి, కె.శ్రీనివాస రాజు, రఘునందన్ రావు
 

విభజన సమస్యల పరిష్కారం నేపథ్యంలో సాగే ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. షెడ్యూల్, 9, 10 కింద  ఉన్న ఆస్తుల పంపకంతో పాటు ఏపీలో కలిపిన ఏడు మండలాలు తిరిగి తీసురావడంపై తెలంగాణ ప్రధానంగా దృష్టి సారించింది. వీటితో పాటు ఎన్నో విభజన సమస్యలు పదేళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చర్చలు సామరస్యపూర్వకంగా జరిగితే... మెజార్టీ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య 30 సమావేశాలు జరిగాయి. ఇందులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు, తేలని అంశాలను అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు. సీఎం చొరవతో మార్చిలో ఢిల్లీలో ఏపీ భవన్ విభజన వివాదం పరిష్కారమైంది. మైనింగ్ కార్పొరేషన్ నిధుల పంపిణీ సమస్య కూడా సెటిల్ అయింది.

షెడ్యూల్ 9 లోని 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వలు పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబీడే కమిటీని వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతాలేమి లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూలులో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణ బకాయిలపై  వివాదం ఉంది. విద్యుత్ సంస్థల బకాయిలపైనా రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉంది. దాదాపు 24 వేల కోట్ల రూపాయలు ఏపీ నుంచి రావాలని తెలంగాణ వాదిస్తోంది. తెలంగాణ 7 వేల కోట్లు చెల్లించాలని ఏపీ అంటోంది.