
హైదరాబాద్, వెలుగు : అంతర్ జిల్లా బదిలీలకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారని మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, పీఆర్ టీయూటీఎస్ మాజీ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి తెలిపారు. 317 స్పౌజ్ బదిలీల్లో అన్ని జిల్లాల భార్యాభర్తల అంతర్ జిల్లా బదిలీలకు అవకాశం ఇవ్వాలని సోమవారం సీఎం రేవంత్ ను కలిసి కోరామని వారు ఓ ప్రకటనలో తెలిపారు. తమ వినతికి సీఎం స్పందించారని, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలను మినహాయించి మిగతా జిల్లాల్లో అవకాశం ఇచ్చేలా చూడాలని, ఈ దిశగా ఆదేశాలు జారీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు సీఎం చెప్పారని పేర్కొన్నారు.