అధిష్టానం చేతుల్లోనే మంత్రి వర్గ విస్తరణ.. నేను ఎవర్నీ సిఫార్సు చేయలేదు : సీఎం రేవంత్ రెడ్డి

అధిష్టానం చేతుల్లోనే మంత్రి వర్గ విస్తరణ.. నేను ఎవర్నీ సిఫార్సు చేయలేదు : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉండాలి.. కొత్త మంత్రులుగా ఎవరు ప్రమాణం చేస్తారు అనేది హైకమాండ్ డిసైడ్ చేస్తుందని.. ఇందులో నా జోక్యం ఏమీ లేదని స్పష్టం చేశారాయన. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. 

మంత్రి వర్గంలోకి ఎవరిని తీసుకోవాలి అనే విషయంలోనూ స్పందించారాయన. నేను ఎవర్నీ సిఫార్సు చేయలేదని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయటమే లక్ష్యంగా పని చేస్తున్నానని.. పార్టీలో జరిగే ప్రతి విషయం అధిష్టానానికి తెలుసు అన్నారు. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరలేదని వివరణ ఇచ్చారాయన. రాహుల్ గాంధీతో తన అనుబంధం ఏంటో తెలియని వాళ్లే.. ఏదేదో మాట్లాడుతున్నారని వివరించారాయన. పని చేసుకుంటూ పోవటమే నాకు తెలుసు అని.. ప్రతి విషయానికి వివరణ ఇచ్చుకుంటూ వెళ్లను అంటూ స్పందించారాయన.

ALSO READ | కొలిక్కి వచ్చిన నూతన టిపిసిసి కార్యవర్గ కసరత్తు.. ఇవాళ లేదా రేపు ( ఫిబ్రవరి 7, 8 ) ప్రకటన

అర్జంట్ గా అరెస్ట్ చేయించి.. జైల్లో వేయాలన్న ఆలోచన ఏమీ లేదని.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని.. ఇందులో ఎవరి జోక్యం ఉండదని మీడియా చిట్ చాట్ లో వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. కుల గణన అనేది ఎంతో సమగ్రంగా జరిగిందని.. బీసీలు 5 శాతం పెరిగారని.. ముస్లింలకు శాశ్వత రిజర్వేషన్ లభిస్తుందన్నారు. అతి త్వరలోనే పార్టీ ప్రతినిధులకు సంబంధించి ప్రకటన వస్తుందని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.