వాస్తవాలు మాట్లాడుదాం.. అసెంబ్లీకి రా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

  • ధైర్యం ఉంటే రా మా వ్యవసాయశాఖ మంత్రి లెక్కలు చెప్తడు
  • నువ్వు పదేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో లెక్క చెప్పు
  • ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడదాం ఇప్పుడు రా..
  • బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి చేయలే
  • 7 లక్షల కోట్లు అప్పు చేసి.. 100 కోట్లకు గుడికి ఇవ్వలే
  • బండి సంజయ్ కేంద్ర మంత్రి అయి చిల్లిగవ్వ తేలే
  • వేములవాడ అభివృద్ధి బాధ్యత నాదే
  • ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే
  • పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తం..: సీఎం రేవంత్ రెడ్డి

వేములవాడ: రైతు రుణమాఫీపై చర్చ కోసం కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలన్నారు. లెక్కలు చెప్పేందుకు మంత్రి తుమ్మల సిద్దంగా ఉన్నారని అన్నారు. నువ్వు పదేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో.. మేం పది నెలల్లో ఎన్ని కొలువులు ఇచ్చినమో లెక్కలు చెప్తం.. రా ఎల్బీ స్టేడియంకు అంటూ ఫైర్ అయ్యారు. అందరినీ పిలిచి మీటింగ్  పెట్ట లెక్కలు చెబుతానని సీఎం అన్నారు. ఇవాళ వేములవాడల జరిగిన సభలో  సీఎం మాట్లాడారు.

‘గత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలనే కాదు.. వేములవాడ రాజన్నను కూడా మోసం చేసిండు.. ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్.. రాజన్న గుడికి వంద కోట్లు ఇవ్వలే.. ఓడగొట్టి ఇంట్ల  పండపెట్టినా.. అసెంబ్లీలో అధికారం  పోయింది.. పార్లమెంటులో గుండు సున్నా వచ్చింది.. అయినా మెదడు కూడా దొబ్బింది.. కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటికి రాడు..  బిల్లా రంగాలు నోటికొచ్చినట్టు మాట్లడుతుండ్రు..  23 అక్షల కుటుంబాలకు రుణమాఫీ చేసినం.. పదేండ్లలో లక్ష రూపాయలని  దేశంలోనే రైతుల ఆత్మహత్యలో తెలంగాణ రెండో స్థానంలో ఉండేలా చేశావ్. 

ALSO READ | హైదరాబాద్‎కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆ ఏరియాలో డ్రోన్లు ఎగరేయడంపై నిషేధం

11 వేల కోట్ల రూపాయలు ఐదేండ్లలో ఇచ్చిండు..  పదేండ్లు అధికారం ఉండి.. 11 వేల కోట్ల రుణమాఫీకి తీసుకున్నవ్.. ఇందిరమ్మ ప్రభుత్వం 25  రోజుల్లో 18 వేల కోట్ల రుణమాఫీ చేసినం.. పెద్దమనిషిగా అభినందించాల్సింది పోయి.. మౌనంగనా నైనా ఉంటావనుకున్న అన్నీ చిల్లర మాటలే మాట్లాడుతున్నవ్. పదేండ్లు  ప్రభుత్వం నడిపినోడు.. పదినెలలు కాకముందే నువ్వు దిగిగో నువ్వు దిగిపో అంటుండ్రు.. మీ కేం నొప్పి.. మా కార్యకర్తల దగ్గర మందు ఉంది.. సోషల్ మీడియాలో నాలుగు హౌలా పోస్టులు పెట్టి సంబుర పడుతుండ్రు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా కార్యకర్తలు కర్రు కాల్చి వాత పెడ్తరు..  కేసీఆర్ గడీలను కూల్చేవరకు ఈ అడుగు ఆగదని గతంలోనే చెప్పాను.. పాదయాత్రలో భాగంగా రాజన్నను దర్శించుకున్నాను. రాజన్న ఆలయ అభివృద్ధి బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.