మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

మైనార్టీ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించారు.  ఆదివారం మధ్యాహ్నం వనపర్తిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 56 వేల మందిని లబ్ధిదారులుగా గుర్తించగా.. ఫస్ట్​ ఫేజ్​​ కింద 10,490 మంది మహిళలకు అందజేశారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలు సీఎంతో సెల్ఫీలు దిగారు.