ఎన్డీయే సర్కార్ దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తుందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణా రాష్ట్రాల పన్నులను నార్త్ కు దోచిపెడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌ను రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
నార్త్ స్టేట్స్ తో పోలిస్తే.. సౌత్ స్టేట్ పన్నులు ఎక్కువగా చెల్లిస్తున్నా.. తిరిగి పొందేది తక్కువ . కేంద్రానికి తెలంగాణ నుంచి రూపాయి పంపిస్తే కేంద్రం తిరిగి రాష్ట్రానికి 40 పైసలు మాత్రమే ఇస్తుంది. మోదీ సర్కార్ పార్టీలను, ప్రభుత్వాలను విడగొట్టడం తప్పదేశానికి, ప్రజలకు చేసిందేమి లేదు. భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం తప్ప మోదీ చేసిందేంటీ.? ఈ దేశంలో ఉత్తర, దక్షిణ భారతదేశం అనే విభజన తేవడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు.
ALSO READ | ఒరిజినల్ బాంబులకే భయపడలే.. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
మూసీ అభివృద్ధికి బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు అడ్డు పడుతున్నాయి. మేం మూసీ పునరుజ్జీవం చేస్తామంటే బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారు. మీరు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకోలేదా? మేము గుజరాత్‌కు పోటీ ఇవ్వబోతున్నాం. అందుకే తెలంగాణను, హైదరాబాద్‌ను ఫినిష్ చేయాలని బీజేపీ నేతలు కుట్ర పన్నుతున్నారు.
నేను ఫ్యూచర్ సిటీ నిర్మిస్తే తప్పేంటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కూల్చే కుట్ర చేశారు. మా ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అండగా వచ్చారు. ప్రతిపక్ష నేతను చేస్తే కేసీఆర్ 10 నిముషాలు అసెంబ్లీలో కూర్చోలేదు. పదేండ్లు పాలించిన కేసీఆర్ ఎందుకు బయటకు రారు . ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే కేసీఆర్ ఎందుకు భయటకు రారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.