టీ ఫైబర్​కు 1,779 కోట్లు ఇవ్వండి

  • దీనికి భారత్ నెట్ ఉద్యమి పథకం వర్తింపజేయండి
  • కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
  • కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయతోనూ భేటీ 
  • స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆర్థిక సాయం చేయాలని, ఖేలో ఇండియా నిధులు పెంచాలని రిక్వెస్ట్

న్యూఢిల్లీ, వెలుగు: టీఫైబర్ ప్రాజెక్టుకు రూ.1,779 కోట్ల వడ్డీ లేని రుణం ఇవ్వాలని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి సింధియాతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఫైబర్ ప్రాజెక్టు గురించి వివరించారు. టీ-ఫైబ‌ర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు కనెక్టివిటీ కల్పించడమే తమ ఉద్దేశ‌మ‌ని సీఎం రేవంత్ చెప్పారు. ‘‘65,500 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ (గవర్నమెంట్ టు గవర్నమెంట్), జీ2సీ (గవర్నమెంట్ టు సిటిజన్) కనెక్టివిటీ కల్పించాలని భావిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇండ్లకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల ఇండ్లకు నెలకు కేవలం రూ.300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ–ఎడ్యుకేషన్ సేవలు అందించాలని యోచిస్తున్నాం” అని అన్నారు.

‘‘రాష్ట్రంలో ఇప్పటికే టీ-ఫైబర్ ద్వారా 300 రైతు వేదికలకు రైతు నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. సాంఘిక సంక్షేమ పాఠశాలలకు కూడా టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నాం” అని సీఎం తెలిపారు. ‘‘టీ-ఫైబర్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,779 కోట్లు. ఇందులో ఇప్పటికే రూ.530 కోట్లు వివిధ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించాం. ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయం రూ. 1,779 కోట్లను యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఎఫ్ఓ) ద్వారా వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్డీ లేని దీర్ఘకాలిక రుణంగా ఇవ్వాలి” అని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. 

ఆ డీపీఆర్ కు ఆమోదం తెలపండి.. 

నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్క్ (ఎన్ఓఎఫ్ఎన్) మొదటి దశ మౌలికసదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి సకాలంలో అందించాలని కేంద్రమంత్రి సింధియాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ‘‘ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశ లైనియర్ ఆర్కిటెక్చర్ ఆధారంగా నడుస్తుంటే.. మిగతా ప్రాంతాల్లో రింగ్ ఆర్కిటెక్చర్ ఆధారంగా టీ-ఫైబర్ నడుస్తున్నది. అందువల్ల నెట్ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమర్థ నిర్వహ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వినియోగం కోసం సకాలంలో ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశ మౌలిక సదుపాయాలను అందించాలి. ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశను భారత్ నెట్–3 ఆర్కిటెక్చర్ కు మార్చడానికి పోయినేడాది అక్టోబరులో కేంద్రానికి రాష్ట్రం నుంచి డీపీఆర్ పంపారు. దాన్ని త్వరగా ఆమోదించాలి. భారత్ నెట్ – 3 ద్వారా రాష్ట్ర ప్రజలకు ఈ–-గవర్నెన్స్ సేవలు అందించగలుగుతాం. గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాల కల్పన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉద్దేశించిన భారత్ నెట్ ఉద్యమి పథకాన్ని టీ-ఫైబర్ కు వర్తింపజేయాలి” అని కేంద్రమంత్రిని కోరారు. 

ఒలింపిక్స్ నిర్వహణకు అవకాశం ఇవ్వండి.. 

రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్సిటీ ఏర్పాటు చేయాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని నిర్ణయించామని, దానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. స్పోర్ట్స్ యూనివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్సిటీలో అన్ని ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాల క్రీడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శిక్షణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో పాటు ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిశోధ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కేంద్రమంత్రి మాండవీయతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో జాతీయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అంత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్జాతీయ క్రీడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నిర్వహ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైన మౌలిక వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నీ ఉన్నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని వివరించారు. భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌విష్యత్తులో నిర్వహించే ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఇత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర జాతీయ, అంత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్జాతీయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రీడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్వహించే అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాశం తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇవ్వాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కోరారు. 

‘‘హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూర్ న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, ఓయూ క్యాంప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్, జింఖానా గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హుస్సేన్ సాగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర ప్రాంతాల్లో అంత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్జాతీయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమాణాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన స్విమ్మింగ్ పూల్స్, మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్టీపర్పస్ ఇండోర్ స్టేడియాలు, సింథ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టిక్ అథ్లెటిక్ ట్రాక్స్, షూటింగ్ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్కేటింగ్ ట్రాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వాట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ స్పోర్ట్స్, ఇత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర క్రీడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తులు ఉన్నాయి. అలాగే హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్ లో ఫైవ్ స్టార్ హోట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళ్లు ఉన్నాయి. విమాన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రైలు స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 2002లో నేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2003లో ఆఫ్రో-ఏషియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 2007లో ప్రపంచ మిల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీ గేమ్స్ హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించారు. వీట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నింట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొని భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌విష్యత్తులో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏషియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్వెల్త్ గేమ్స్ తెలంగాణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించే అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాశం ఇవ్వాలి” అని కేంద్రమంత్రి మాండవీయకు విజ్ఞప్తి చేశారు.  

ఖేలో ఇండియా గేమ్స్​కుచాన్స్ ఇవ్వండి..  

రాష్ట్రంలో క్రీడా మౌలిక వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తుల అభివృద్ధికి ఖేలో ఇండియా స్కీమ్ కింద నిధులు పెంచాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కేంద్రమంత్రి మాండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్ గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చిబౌలిలోని జీఎంసీ బాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యోగిస్టేడియం, సెంట్రల్ యూనివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్సిటీలోని షూటింగ్ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎల్బీ స్టేడియం, హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కీంపేట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని స్పోర్ట్స్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూర్ న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ ఇండోర్ స్టేడియంల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మౌలిక వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తుల అభివృద్ధికి తాము ఇప్పటికే పంపించిన డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆమోదించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని విజ్ఞప్తి చేశారు. అలాగే 2025 జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణలో హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాశం ఇవ్వాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కోరారు.