డీలిమిటేషన్పై హైదరాబాద్లో బహిరంగ సభ పెడ్తాం: సీఎం రేవంత్

డీలిమిటేషన్పై హైదరాబాద్లో బహిరంగ సభ పెడ్తాం: సీఎం రేవంత్

డీలిమిటేషన్ పై హైదరాబాద్ లో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. డీలిమిటేషన్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు.  దీనిపై హైదరాబాద్ లో మరో అఖిలపక్ష సమావేశం నిర్వహించి బహిరంగ సభ  పెడతామన్నారు. 

డీలిమిటేషన్ విషయంలో బీజేపీ సొంత ఎజెండాతో  ముందుకెళ్తుందని ఆరోపించారు సీఎం రేవంత్.  దక్షిణాది ప్రజల సమస్యలు బీజేపీకి పట్టడం లేదన్నారు. ఇది పార్టీల  సమస్య కాదు..దక్షిణాది ప్రజల సమస్య అని అన్నారు. డీలిమిటేషన్ పై  పార్లమెంట్ లో ఎందుకు చర్చ పెట్టడం లేదని ప్రశ్నించారు రేవంత్.   దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం మోసం చేయాలని ప్రయత్నిస్తోందన్నారు.   కేంద్రం ఏ ప్రాతిపాదికన నియోజకవర్గాల పునర్విభజనన చేయాలనుకుంటుందో అర్థం కావట్లేదన్నారు.  డీలిమిటేషన్ పై కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదన్నారు. స్టాలిన్ పోరాటాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తాం..అన్ని రాష్ట్రాలను కలుపుకుని ముందుకెళ్తామన్నారు సీఎం రేవంత్.  

ALSO READ | నెక్ట్స్ పవర్ మనదే.. ఒక్కో కార్యకర్త ఒక్కో కేసీఆర్ కావాలి: KCR

మార్చి 22న డీలిమిటేషన్ పై జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ కు తెలంగాణ నుంచి  సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మల్లు రవి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. 25 ఏళ్ల వరకు నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేయాలని ఆల్ పార్టీ మీటింగ్ లో తీర్మాణం చేశారు.