
- మాజీ మంత్రి దేవినేని ఉమ కొడుకు పెండ్లికి హాజరు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి బుధవారం విజయవాడ వెళ్లనున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన బెజవాడకు వెళ్లనున్నట్లు తెలిసింది. ఉదయం 9.15 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవా డకు సీఎం బయలుదేరుతారు. ఉదయం 10.40 గంటలకు విజయవాడ సమీపంలోని కానూరు వద్ద ఉన్న ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో జరిగే వివాహ వేడుకలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 వరకు హైదరాబాద్ చేరు కుంటారు.