రేపు (జూలై8న) ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి.. షెడ్యూల్ ఇదే  

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (జూలై 8) ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న వైఎస్సార్ జయంతి  సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సోమవారం మధ్యాహ్నం 3.15 కు బేగంపేట్ ఎయిర్ పోర్టునుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. సీఎం తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు కూడా వెళ్లనున్నారు. 

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు సోమవారం విజయవాడ సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, లోక సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తోపాటు.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు హాజరు కానున్నారు.