హైదరాబాద్, వెలుగు : రంజాన్ మాసం ప్రా రంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీ మణులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమ శిక్షణ పాటిస్తారని.. పెద్ద ఎత్తున పేదలకు దానధర్మాలు చేస్తారని గుర్తుచేశారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందన్నారు. రంజాన్ ఉప వాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొం దిస్తాయని తెలిపారు. ముస్లింల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని వెల్లడించారు. వారి సంక్షేమానికి నిధులు కేటా యించి, అభ్యున్నతికి తోడ్పడే కార్యక్రమాలు అమలు చేస్తామని సీఎం పేర్కొన్నారు.