ప్రజాభవన్ లో తెలంగాణ, ఆంధ్రా సీఎం ల భేటీ ముగిసింది. విభజన సమస్యలు పరిష్కారం కోసం రెండు కమిటీలు వేయాలని సీఎంలు రేవంత్, చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మంత్రులతో ఒక కమిటి.. అధికారులతో మరో కమిటి వేయాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. మంత్రుల కమిటీలో తెలంగాణ నుంచి పొన్నం, శ్రీధర్ బాబు ఉండే అవకాశం ఉంది.
గంటా 45 నిమిషాల పాటు జరిగిన భేటిలో పలు సమస్యలు చర్చించినట్లు సమాచారం అందుతోంది. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వకంగా చర్చకొనసాగింది. ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి మొదటి అడుగు పడింది.ప్రజాభవన్‌లో కొనసాగిన ఈ భేటీలో విభజన అంశాలపై లోతుగా చర్చ జరిగింది. విభజన చట్టంలో ఉన్న ఆస్తులు, అప్పులపై చర్చించిన ముఖ్యమంత్రులు.. హైదరాబాద్‌లోని కొన్ని భవనాలు ఏపీకి ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. అయితే… హైదరాబాద్‌లో ఉన్న స్థిరాస్తులు మొత్తం తెలంగాణకు చెందుతాయని చెప్పిన రేవంత్. స్థిరాస్తులు ఏపీకి ఇవ్వడానికి నిరాకరించినట్లు పేర్కొన్నారు. విద్యుత్ బకాయిలపై ఏపీ ప్రస్తావించగా.. బకాయిలు చెల్లించేది లేదన్న తెలంగాణ వెల్లడించింది.. ఏపీ ప్రభుత్వమే విద్యుత్ బకాయి పడ్డారని తెలంగాణ తెలిపింది. విద్యుత్ బకాయి లెక్కలు సీఎంల ముందుంచారు ఇరు రాష్ట్రాల అధికారులు. ఐదు గ్రామాల వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన ప్రధానంశాలు
- 1) విభజన చట్టంలో పేర్కొన్న, పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు
- 2) ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు
- 3) పెండింగ్ విద్యుత్తు బిల్లులు
- 4)విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటి అప్పుల పంపకాలు
- 5)ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు
- 6)హైదరాబాద్‌లో ఉన్న మూడు భవనాలు ఏపీకి కేటాయించే అంశం
- 7)లేబర్ సెస్ పంపకాలు
- 8)ఉద్యోగుల విభజన అంశాలు.