ఢిల్లీలో రేవంత్ ముప్పుతిప్పలు

ఢిల్లీలో రేవంత్ ముప్పుతిప్పలు

 

  •  అధిష్టానం వద్ద రెగ్యులర్ గా పడిగాపులు 

  • సీఎంలను అవమానించడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది 

  • రాష్ట్రం నలుగురు నడుమ నలిగి పోతోంది 

  • మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిని ముప్పుతిప్పలు పెడుతుందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్రం నలుగురు నడుమ నలిగి పోతోందని అన్నారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో  ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ప్రభాకర్​మాట్లాడారు. ‘రాష్ట్రాన్ని పాలిస్తున్నది రేవంత్ రెడ్డా.. కాంగ్రెస్ అధిష్టానమా? ఆయన ఢిల్లీ వెళ్లడం పరిపాటి అయ్యింది. అక్కడ హైకమాండ్​వద్ద పడిగాపులు కాయడం కూడా రెగ్యులర్ గా జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ కోసం ఇన్నిసార్లు అనుమతి కోరాలా?  సీఎంలను అవమానించడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. దీపాదాస్ మున్షీ రాజ్యాంగేతర శక్తిగా మారారు. ముందటి కాళ్లకు బంధం వేసి సీఎంను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వడం లేదు. 

రేవంత్ చేసిన ప్రతి ప్రకటనపై కాంగ్రెస్ అధిష్టానం అడ్డు పడుతోంది. రాష్ట్రం రేవంత్ రెడ్డికి,  మున్షీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ల మధ్య నలుగుతోంది. పాలనా పరమైన విషయంలో మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి వెళ్తోంది.  రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఓ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే మంచిది. చంద్రబాబు, రేవంత్​కలిస్తే మంచేదే. ఈ భేటీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతి ఉందా?  ఈ సమావేశం చివరికి ఏదో ఒక కారణంతో ఆగిపోతుంది ’ అని అన్నారు.