ఆర్మూర్​కు రూ.50.82 కోట్లు

ఆర్మూర్​కు రూ.50.82 కోట్లు

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ నియోజకవర్గానికి సీఎం రేవంత్​రెడ్డి రూ.50.82 కోట్ల నిధులు మంజూరు చేశారని ఆర్మూర్​ నియోజకవర్గ కాంగ్రెస్​ పార్టీ ఇన్‌చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్‌‌ఎస్​ ప్రభుత్వంలో రద్దైన టీయూఎఫ్​ఐడీసీ నిధులను మంజూరు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డిలను కలిసి మెమోరాండం ఇచ్చారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆర్మూర్​ నియోజకవర్గ ప్రజల తరఫున వినయ్​రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.