మన వాటా మనకు కావాలి.. ట్రిబ్యునల్ ముందు బలంగా వాదనలు వినిపించండి

  • ఇరిగేషన్ ​అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
  • గోదావ‌రి- బ‌న‌క‌చ‌ర్లపై అభ్యంత‌రాల‌తో జ‌లశ‌క్తి మంత్రి, ఏపీ సీఎంకు లేఖ‌లు రాయాలని ఆదేశం 
  • పోల‌వ‌రం ముంపుపై ఐఐటీతో త్వరగా అధ్యయనం చేయించాలని సూచన

న్యూఢిల్లీ / హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో మన వాటా మనకు దక్కాల్సిందేనని, ఇందుకోసం ట్రిబ్యునల్​ ముందు బలంగా వాదనలు వినిపించాలని అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి దిశానిర్దేశం చేశారు. అంత‌ర్రాష్ట్ర న‌దీ జ‌లాల వివాదాల చ‌ట్టం (ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ)-1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు జరిపేలా కృష్ణా జ‌ల వివాదాల ట్రిబ్యున‌ల్‌-II (కేడ‌బ్ల్యూడీటీ-II) ఎదుట వాదించాలని సూచించారు. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం (ఏపీఆర్ఏ)-2014లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల‌ వారీగా నీటి కేటాయింపులు చేప‌ట్టాల్సి ఉంద‌న్నారు. ఏపీఆర్ఏ ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌనిల్ సైతం సెక్షన్  3 ఆధారంగా నీటి పంప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాలు రెండు రాష్ట్రాల మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధ్య చేప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సూచించింద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని గుర్తు చేశారు. 

కేడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్ల్యూడీటీ-II త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దుప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి విధివిధానాలపై (ఫ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ ట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్మ్స్ ఆఫ్ రిఫ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా కోర్ట్  ఎలాంటి స్టే ఇవ్వని విష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్నీ గుర్తు చేశారు. నీటి పారుద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల శాఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న అధికారిక నివాసంలో బుధ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వారం స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీక్ష నిర్వహించారు. నీటి పారుద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల శాఖ మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ బాబు, పొంగులేటి శ్రీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎం స్పెషల్ సెక్రటరీ వి.శేషాద్రి, రాష్ట్ర ప్రభుత్వ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాదారు (నీటి పారుద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల శాఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఆదిత్యనాథ్ దాస్,  నీటి పారుద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల శాఖ కార్యద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శి రాహుల్ బొజ్జా త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రులు పాల్గొన్నారు. 

ఎలాంటి అనుమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తులు లేకుండా ఏపీ సర్కార్ గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి-–బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ల అనుసంధాన ప్రాజెక్టు చేప్టట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డంపై కేంద్ర జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లశ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రి, కృష్ణా బోర్డుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తెలంగాణ త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫున అభ్యంత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాలు తెలుపుతూ లేఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రాయాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విభ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా ఏ న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిపైనైనా ప్రాజెక్టు నిర్మించాలంటే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పొరుగు రాష్ట్రానికి స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాచారం ఇవ్వాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే విష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్ని లేఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ప్రస్తావించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సూచించారు. పోల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రం ప్రాజెక్టుతో భద్రాచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లం ముంపు విష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యంపై హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్ ఐఐటీతో అధ్యయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నం చేయించే అంశాన్ని నిర్దేశిత స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యంలో పూర్తి చేయించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఆదేశించారు. స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మక్క–సార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్క బ్యారేజీ, పాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మూరు–-రంగారెడ్డి ఎత్తిపోత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తులు సాధించే ప్రక్రియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వేగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వంతం చేయాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సూచించారు.

లీగల్​ టీమ్​తో ఉత్తమ్​ భేటీ.. 

కృష్ణా జలాల్లో మన వాటా మనకు దక్కేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. గురువారం నుంచి ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాదనలు జరగనున్న నేపథ్యంలో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయన బుధవారం ఢిల్లీలో లీగల్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమావేశమయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ ​సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో నలుగురు అడ్వకేట్లు తెలంగాణ తరఫున ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాదనలు వినిపిస్తున్నారు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. తెలంగాణ వాదనను బలంగా వినిపించేందుకు మరో ఇద్దరు అడ్వకేట్లను నియమించుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. దీంతో ఆ ఇద్దరు అడ్వకేట్లను కూడా మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చి వారి నుంచి న్యాయ సలహా తీసుకున్నట్టు తెలిసింది. కానీ ప్రస్తుతం ఉన్న లీగల్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే వాదనలు కొనసాగించాలని నిర్ణయించినట్టు సమాచారం.