తెలంగాణలో చలి.. పులి... జనాలు వణుకుతున్నారు..

తెలంగాణలో చలి.. పులి... జనాలు వణుకుతున్నారు..

తెలంగాణలో రాబోయే 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉందని తెలిపింది.  ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్​ ఎలర్ట్​ జారీ చేశారు. ఇక హైదరాబాద్​ సిటీలో రెండు రోజులు చలిగాలులు తీవ్రంగా ఉంటాయి. టెంపరేచర్​ 3 నుంచి 5 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉదయం ....రాత్రి సమయాల్లో పొగమంచు తీవ్రంగా పడుతుంది.  వచ్చే వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.  రంగారెడ్డి, వికారాబాద్​, మెదక్​ జిల్లాలకు అలర్ట్​ జారీ చేశారు. హైదరాబాద్​ నగరాన్ని పొగమంచు కప్పేసింది. జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రోడ్డు కనిపించక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత పెరుగుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.